Breaking News

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర


జననం: జనవరి 23, 1897
మరణం: చెప్పలేం. కానీ ప్రభుత్వం ప్రకటించింది ఆగష్టు 18, 1945. నేతాజీ మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి.

విజయాలు: ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత; 1938 మరియు 1939 లో కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు; భారతదేశం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ను ఏర్పరిచారు; భారతదేశం నుండి బ్రిటిష్ సామ్రాజ్యన్ని పడగొట్టే ఆజాద్ హింద్ ఫౌజ్ ను నడిపించారు.


ప్రభావతి దేవి, జానకి నాద్ బోస్ దంపతులకు కటక్ లో జన్మించిన సుభాష్ చంద్ర బోస్ భారత స్వాతంత్ర్య సమవీరులలో అగ్రగణ్యుడు. అలుపెరుగని పోరాటంతో వోటమి ఎరుగని వ్యక్తిత్వంతో మాతృభూమి సేవలో తన ప్రాణాలను బలిదానం చేసిన మహానుభావుడు.

ముగ్గురు అన్నల తర్వాతి వాడు కనుక గారాబంగా పెరిగినా, బాల్యం నుండి క్రమశిక్షణ,దేశ భక్తి, దైవ భక్తి సాటి మానవులకు సేవ జేయాలనే తపన ఆయనలో ఉండేవి. ఒక్కసారి చదివితే చాలు దేన్నైనా మర్చిపోయే వాడు కాదు. అన్యాయం జరుగుతున్నది అనిపిస్తే ఎవరికైనా ఎదురు తిరగడమే బాల్యంనుండి ఆయనకు అలవాటు.

బాల్యంలో ప్రోటేస్తేంట్ యురోపియన్ స్కూల్ లో భారతీయ విద్యార్ధులను చులకన జేసి ఇబ్బందిపెడుతుంటే రెండుసార్లు విద్యార్ధులను కూడా దీసి ఆంగ్లేయ విద్యార్ధులను చితక బాదడంతో మొదలైకలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో ఇంటర్ చదువుతున్నప్పుడు అన్యాయంగా నిందించిన ప్రొఫెసర్ని నిలదీసి, కళాశాల బందు చేయించి, విద్యార్ధులను కూడగట్టి చివరికి కళాశాల నుండి వెలివేయ బడేదాకా,ఆ తర్వాత స్వతంత్ర సమర రంగంలో ప్రవేశించిన తర్వాత ఎవరినైనా సరే నిర్మొహమాటంగా నిలదీయటం వలన ఎందరు ఆయనను వ్యతిరేకించినా నిజాన్ని నిర్భయంగా వెల్లడించడం, ఎవరికీ అడుగులకు మడుగులు వత్తని స్వంతంత్ర వ్యక్తిత్వం, ఆయన మీద జాతీయ స్థాయి వాళ్ళు అనిపించుకున్న వాళ్ళకు కూడా ఈర్ష్య ను కలిగించాయి! ఐనా ఎవరికీ ఆయన ఎన్నడూ భయపడలేదు, గులాంగిరి చేయలేదు! సింహం లాగా బ్రతికి యుద్ధరంగంలో సింహం లాగానే మరణించాడు.

పండగకు కొత్త బట్టలు, మిఠాయి, వద్దు అని అందుకు బదులుగా..ఆంగ్లేయులను ఎదిరించినందుకు నడి వీధిలో కొరడా దెబ్బల శిక్షను అనుభవిస్తున్న సుశీల్ కుమార్ అనే అతడిని చూపించమని తన మేన మామనుపట్టుబట్టి అక్కడికి వెళ్లి..ఆ సుషీల్ కుమార్ను కొడుతున్నప్పుడల్లా ఆవేశంతో తను వుగిపోతుంటే మేన మామకు భయం వేసి అక్కడినుండి తీసుకొచ్చాడు! తన నోట్ పుస్తకాలలో దేశ భక్తుల, విప్లవ విరుల ఫోటోలు అతికించుకునివరిగురించే మననం చేస్తుంటే ఆ నోట్ పుస్తకం చూసినఅతని తండ్రి స్నేహితుడు భవిష్యత్తులో వీడు ఆంగ్లేయులకుకొరకరాని కొయ్య అవుతాడు అన్నాడుట!

ఉత్తర ప్రత్యుత్తరాలంటే సుభాష్ చంద్ర బోస్ కి చాలా అభిరుచి వుండేది. అతని ఉత్తరాలు ఎంతో లోతైన, సునిశితమైన వేదాంత భావాలతో, సూక్తులన్ వంటి వ్యాఖ్యానాలతో ఉండేవి, అతని వుత్తరాలకోసం ఇంటిల్లిపాది ఎదురు జూసే వారు. వేణీ మాధవ్ అనే ఉపాధ్యాయుడు ఈయనను చాలా ప్రభావితుడిని చేశాడు. శారీరక, మానసిక ఆరోగ్యం ఈ రెండూ సమన పాళ్ళలో వుండాలని భావించేవాడు. ధ్యానం, ప్రకృతి వొడిలో వొంటరిగా గడపడం, వివేకానంద బోధనలనుపఠించడం, చరిత్ర ను చదవడం ఆయనకు అభిరుచులుగా ఉండేవి. తను కాలేజికి నడచి వెళ్లి..డబ్బులు మిగిల్చి వృద్ధులైన బిచ్చగాళ్ళకు దానం చేసే వాడట! కలకత్తా లో నావ వివేకానంద సమూహం అనే సంస్థ లో సభ్యుడైసామాజిక, ఆధ్యాత్మిక సేవ జేసేవాడు. ఎవరికీ చెప్పకుండా ఒక మిత్రుడిని వెంట తీసుకుని హరిద్వార్, హృషికేష్వారణాసి మొదలైన ప్రదేశాలన్నీ ఒక గురువు కావాలని అన్వేషిస్తూ కొన్నాళ్ళు తిరిగి ఎక్కడ చూసినా, ఉపన్యాసాలు, పూజలు, యజ్ఞ గుండాలు చూసి విసుగొచ్చి వెనక్కోచ్చాడు.

కటక్ లో ఉన్నప్పుడే ఇంటర్ చదువుతున్నప్పుడు 'స్వేచ్చా సేవ సంఘ్' అనే ఒక సంస్థను ఏర్పాటు జేసి, యువకులనుకూడ దీసి సమాజ సేవ, శారీరక, మానసిక ఆరోగ్యం కోసం వ్యాయామం, ధ్యానం, క్రీడలు, వివిధ అంశాలపై ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అతను కుర్చుని చదువుతున్నట్లు ఎవరూ ఎన్నడూ చూడలేదు..మెట్రిక్యులేషన్,ఇంటర్, తర్వాత బి.యే...అన్నింటిలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత ఐ.సి.ఎస్. లో అఖిల భారత స్థాయిలో నాలుగవ స్థానం పొందాడు. ఆ తర్వాత భారత్ తిరిగి వచ్చిన తర్వాత గాంధీని కలిశాడు. కొంతకాలం కలకత్తా నేషనల్ కాలేజికి ప్రిన్సిపాల్ గా పని జేశాడు. చిత్తరంజన్ దాస్ స్థాపించిన స్వయం సేవక దళంలో కార్యకర్తగా వున్నాడు. 'బంగ్లార్ కధ' 'ఫార్వార్డ్' అనే పత్రికలకు సంపాదకుడిగా పనిజేశాడు. విప్లవ మార్గంలో పోరాటం చేస్తున్న 'యుగాంతర్' 'అనుశీలన్' అనే సంస్థలకు అభిప్రాయ భేదాలు వస్తే సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించాడు.

ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారత దేశాజ్ వచ్చినప్పుడు నిరసన చేసినందుకు ఆర్నెల్లు జైలు శిక్ష విధిస్తే న్యాయ మూర్తితోకోడి ని దొంగిలిస్తేనే ఆర్నెల్లు శిక్ష వేస్తారు..ఇదేనా ప్రిన్సు ఆఫ్ వాలెస్ కి వున్న విలువ? అని ప్రశ్నించాడుట!కలకత్తా కార్పోరేషన్ లో అధికారిగా వున్తూన్నప్పుడు ఒక ఆంగ్లేయుడు సిగరెట్ తాగుతూ ఆఫీసులోకొస్తేచెడా మడా వాయించి క్షమాపణ చెప్పించాడు..ఆ క్స్క్షతో..ఇంకొన్ని కారణాలతో ఆయనను ఖైదు చేసి, అక్కడక్కడాజిల్లాలో వుంచి చివరికి మండలే జైలుకు పంపారు! అక్కడినుండే జైలులోనుండే కలకత్తా శాసన సభకు ఎన్నికయ్యాడు.ఆయన ఆరోగ్యం జైలులో విషమిస్తే, పైపెచ్చు ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే తప్పనిసరి..కొన్ని ఆంక్షలు విధించి ఆయననుప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత బెంగాల్ కాంగ్రెస్స్ అధ్యక్షుడిగా, అఖిల భారత కాంగ్రెస్స్ సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అప్పుడే దేశమంతా పర్యటిస్తూ ఆయన చేసే ప్రసంగాలకు లక్షలాది మంది ప్రేరితులయ్యారు..దీనితో ఆయనకు పెరుగుతున్న ఆదరణకు అసూయా పరులూ పెరిగారు!

ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా మళ్ళీ ఆయన్ను అర్రెస్ట్ జేసి అక్కడక్కడా జైళ్లలో తిప్పి..చివరికి మళ్ళీ దేశ బహిష్కర శిక్ష వేసింది..ఆయన ఆరోగ్యం క్షీణిస్తే ప్రజలు చందాలు వేసి మరీ వియన్నా పంపారు.చికిత్స మరియు విశ్రాంతి కోసం..అప్పుడే యూరప్పర్యటించాడు..ముస్సోలినీ..హిట్లర్..రోమరోల..మొదలైన మహామహులను కలిశాడు..ఆ రోజుల్లోనే..1933 లో ఇండియన్ స్ట్రగుల్అనే పుస్తకాన్ని వ్రాశాడు. తండ్రి మరణం తో భారత దేశానికి వచ్చి మళ్ళీ యూరప్ వెళ్ళాడు. వియన్నాలో చికిత్స తీసుకున్నాడు. ౧౯౩౬ లొ నెహ్రూ అధ్యక్షతన లక్నో లో జరిగే కాంగ్రెస్స్ సమావేశాలకు భారత దేశంలో దిగగానే ఆయనను అర్రెస్ట్ జేసి ఎరవాడ జైలుకు పంపారు. పిత్తా శయంలో లోపం వల్ల గొంతు బొంగురు పోయింది. 1937లో ఆయనను విడుదల చేశారు. అఖిల భారతకాంగ్రెస్స్ అధ్యక్షుడయ్యాడు. దేశమంతా పర్యటిస్తూ ప్రజలను తన స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలతో ఉర్రూతలూగించాడు.ఈ దశలో ఆయన దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడయ్యాడు!. సహజంగానే ఆది ఆయనపట్ల అసూయాపరులను పెంచింది. రెండవ సరి మళ్ళీ పోటీజేసి పట్టాభి సీతారామయ్య మీద గెలిచి కాంగ్రెస్స్ అధ్యక్షుడయ్యాడు..అప్పుడు తీవ్ర అనారోగ్యంతోకనీసం తన గెలుపు కోసం యే మాత్రం ప్రయత్నం కూడా చేయలేదు ఆయన..అధ్యక్షా ఉపన్యాసం కూడా ఆయన వ్రాసి ఇస్తే ఆయనసోదరుడు చదివి వినిపించాడు. ఆ తర్వాత ఆయన వెనుక ఎన్నో కుట్రలు ప్రయత్నాలు జరిగి 1939 లో ఆయనను కాంగ్రెస్స్ నుండి బహిష్కరించారు!

లొంగడం, పోరాటం ఆపడం, ఒకరి కాళ్ళు పట్టుకోడం తెలియని వాడు కనుక వెంటనే ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ ని పెట్టాడు.వారపత్రికను కూడా వెలువరించడం మొదలు పెట్టాడు. మరలా దేశమంతటా పర్యటించాడు..మద్రాసు మొదలుకొని ప్రతి చోటా ప్రతిసమావేశానికీ లక్షలాదిమంది ప్రజలు ఆయన ఉపన్యాసాలకు వచ్చే వారు! అంబేద్కర్, సావర్కర్, హెడ్గెవార్ మొదలైన వారందరినీ కలిశాడు.. అందరూ ఆయనలో ఒక గొప్ప నాయకుడిని, అకళంక దేశ భక్తుడినీ చూశారు..1940 లో మరలా ఆయననుఅర్రెస్ట్ చేసి, తప్పనిసరి ఐ విడుదల చేసి, గృహ నిర్బంధం లో ఉంచితే..పథకం ప్రకారం 17 -01 -1941 న మహమ్మద్ జియా ఉల్ హక్అనే దొంగ పేరుతో పాస్ పోర్ట్ సంపాదించి తప్పించుకుని..తన వ్యక్తి గత సేవకుడు భగత్ రామ్ కు రహమత్ ఖాన్ అని పేరు పెట్టి.. అతనితో కలిసి..Kaka మెయిల్ లో ఢిల్లీ..పెషావర్..కాబుల్ దాటి భారత సరి హద్దులను దాటి నప్పుడు కళ్ళ నీళ్ళతో..వందే మాతరంనినాదం చేస్తూ..సాష్టాంగ దండ ప్రణామం చేసి..భారత దేశ ధూళిని నుదుట పెట్టుకున్నాడుట! కాబూల్ లో ఉత్తం చంద్ మల్హోత్రా అనే వ్యాపారి ఆయనకు బస, ధనం, ఇతర సహకారాలు ఇచ్చాడు. రష్యా,జర్మని, ఇటాలి దేశ రాయబారులతో మంతనాలుచేశాడు. 1941 మార్చ్ 18 న అక్కడి నుండి ఒర్లాండ్ అనే మారు పేరుతొ సమర్ఖండ్, మాస్కో ల మీదుగా బెర్లిన్ చేరుకున్నాడుజపాన్, ఇటలి, జెర్మని లకు చెందిన సైన్యాధికారులను కలుసుకున్నాడు..వారందరూ ఈయనను ఎన్నో రకాలుగా పరిశీలించినతర్వాత ఈయనను స్వతంత్ర భారత రాయబారిగా గుర్తించారు! బెర్లిన్లోనే ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన జరిగింది..26 -01 -1942 న పులి బొమ్మ కలిగిన జండా ఎగరేసి..బోస్ వేలాది మంది సైనికులను ఉద్దేశించి ప్రసంగించాడు..వారందరూ రక్త శపథం చేశారుప్రాణాలున్నంత వరకూ భారత దేశ స్వతంత్రం కోసం పోరాడతామని. రోం లో, జపాన్ లో కూడా ఆజాద్ హింద్ ఫౌజ్ శాఖలు ఇతర స్వతంత్ర వీరుల నేతృత్వం లో ఏర్పడ్డాయి. 27 -02 -1941 నాడు ఆజాద్ హింద్ ఫౌజ్ రేడియోలో అద్భుతమైన ప్రసంగం చేసి యావత్భారతాన్నీ ఆవేశం లో ముంచెత్తాడు.

ప్రపంచ యుద్ధం తీవ్రమై..ఆంగ్లేయులు వరుసగా వోటమి పాలు అవుతూ..ఒక్కొక్క దేశాన్నే ఒక్కొక్క నగరాన్నే వదిలి పెట్టడం మొదలు పెట్టారు.జపాన్ వరుస విజయాలను నమోదు చేస్తున్నది..జపాన్ లోని ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యులు..రాస్ బిహారీ బోస్ మొదలైన వారు ఆహ్వానిస్తే 45 రోజులు ఒక జలాంతర్గామిలో ప్రయాణించి జపాన్ చేరుకొని అక్కడ తన పేరు 'మత్సుడ' అని మార్చుకున్నాడు.. టోక్యో..సింగపూర్..రంగూన్ లలో సమ్మోహితులను జేశే స్ఫూర్తి దాయకమైన ఆయన ఉపన్యాసాలకుఆజాద్ హింద్ ఫౌజ్ లో తండోపతండాలుగా సైనికులు చేరారు..మహిళలకోసం ప్రత్యకమైన విభాగాన్ని ఏర్పాటు చేయ వలసి వచ్చింది...రంగూన్ లో ఝాన్సీ లక్ష్మీ బాయి రెజిమెంట్ ను ఏర్పాటు చేసి..మహిళలకు యుద్ధ శిక్షణ నివ్వడం మొదలు పెట్టారు.

చలో ఢిల్లీ నినాదం ఇచ్చి..ప్రత్యక్ష యుద్ధానికి ప్రణాళిక రచించి..జపాన్ సహకారం ఖాయం ఐన తర్వాత..ఇంఫాల్, అండమాన్, నికోబార్ లను జయించి అక్కడ స్వతంత్ర భారత పతాకాన్ని ఎగురవేసి ముందుకు సాగుతుండగా..అంతవరకూ సహకరించిన విధి ప్రక్కకు తొలిగి పోయింది..కష్టాలు చుట్టూ ముట్టడం మొదలు పెట్టాయి..ముస్సోలినీ, హిట్లర్ ల చరిత్ర సమాప్తం ఐంది..జపాన్ దేశం యుద్ధంలో వోటమి చవిచూడడం మొదలు పెట్టింది..బర్మాలో తీవ్రమైన వరదల మూలంగా సైనికులు అనారోగ్యం, మృత్యువులకు గురి అయినారు..ముందుకు, వెనక్కూ పోలేని పరిస్థితి వచ్చింది..జపాన్ సైన్యాధికారుల మధ్య అభిప్రాయ భేదాలు పెరిగి సమన్వయ లోపం వచ్చింది..రష్యా జపాన్ మీద దాడి చేసింది..జపాన్ మీద అణు బాంబ్ పడ్డది..జపాన్ అతలాకుతలమై లొంగిపోయింది..సుభాష్ చంద్ర బోస్ నిస్సహాయుడైనాడు..సహచరుల మొండి పట్టుదల బలవంతం మేరకు సుభాష్ చంద్ర బోస్ సురక్షిత స్థలానికి వెళ్ళడం కోసం, అజ్ఞాతం లోకి వెళ్ళడం కోసం మంచురియా వెళ్ళడానికి అయిష్టంగానేబయలు దేరాడు.జపాన్ లో విమానం ఎక్కి తైపే దాక ప్రయాణించిన తర్వాత విమానం లో సాంకేతిక ఇబ్బంది ఏదో వచ్చి..కూలి పోయింది..ఆ విమానంతో పాటే 35 కోట్ల భారతీయుల ఆశలూ నేల కూలాయి..స్వాతంత్ర్యం బిచ్చమడిగి తీసుకునే దానం కాదు..పోరాడి గెలుచుకునే హక్కు..అని నినదించి..చలో ఢిల్లీ అని గర్జించి..'' నేను మీకు కేవలం ఆకలి, దాహం, కష్టం, మృత్యువును మాత్రమే ఇవ్వగలను..నాకు మీ రక్తాన్ని ఇవ్వండి..మీకు స్వతంత్రాన్ని ఇస్తాను..'' అని విశ్వాసం చివురింపజేసిన స్వతంత్ర పోరాట ధ్రువ తార నేల కూలింది..మెడ నుండి నడుము దాక తీవ్రంగా కాలిపోయి, సమీపం లోని హాస్పిటల్ లో వైద్య ప్రయత్నం జరిగినా..తీవ్రంగా మంటలలో కాలిపోయిన ఆయన ...18 -08 -1945 రాత్రి 8 .30 లకు కన్ను మూశారు!

సుభాష్ చంద్ర బోస్ బ్రతికి వుంటే..ఈ దేశ పరిస్థితి ఇప్పుడు ఇంకోలాగుండేది!!

7 comments:

  1. తెలుగులో స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలు గల ఈ బ్లాగును మాకు అందించిన మీకు కృతఙ్ఞతలు.

    ReplyDelete
    Replies
    1. దయచేసి కామెంట్ చేసేవారు మీ పేరుతో చేస్తే బాగుంటుంది.

      ధన్యవాదములు...

      Delete
  2. He is also father of Indian National Army. Please add this

    ReplyDelete
  3. BOSS MANASHI KADHU MANASHI RUPAM LOO UNNA DEVUDU ENADU MANAM ELA SWECHHAGA BRATHUKUTHUNNAMANTE DANIKI KARAM EEEE DEVUDU KADHU EEE MAHAVEERULU MY NAME IS NAVEEN HULGERA RAIKODE MANDAL D.MEDAK 703636155 AMBEDKAR FANS

    ReplyDelete
    Replies
    1. అవును నవీన్ గారు మీరు చెప్పింది నిజం. ఈ విషయాలను అందరికి చేరాలనే ఈ బ్లాగులో అన్నీ దేశానికి, దేశానాయకులకు సంబందించినవే ప్రచురిస్తున్నాను. మీరు కూడా ఈ విషయాలను మీ స్నేహితులకు చేరేలా ప్రయత్నించండి.

      ధన్యవాదములు...

      Delete
  4. భారతీయుల గుండెలో సుభాష్ చంద్ర బోస్ బ్రతికే ఉన్నాడు...

    ReplyDelete