Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 14 / 50



1953 అక్టోబర్ 29 న మొదటిసారిగా పెజావర్ స్వామీజీ శ్రీ విశ్వేశతీర్థులు, శ్రీ గురూజీ ని కలిసి మాట్లాడారు. ఆ సందర్భంగా ' విభజిత భారత్ మళ్ళీ అఖండమవుతుందా? మనం దానిని చూడటం సాధ్యమా? అని శ్రీ గురూజీని అడిగారు స్వామీజీ. 
ప్రశ్న విన్న శ్రీ గురూజీ చాలా ప్రశాంతంగా , విశ్వాసంతో కూడిన స్వరంతో " అవుతుంది.
ఖచ్చితంగా అవుతుంది. మనం ఇప్పటికీ , ప్రతిరోజూ స్నానపు సమయంలో ' గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ' శ్లోకాన్ని పఠిస్తున్నాం కదా? ఈ శ్లోకంద్వారా మనం ప్రతినిత్యం సింధునదిని స్మరిస్తున్నాము. సింధును మనం మరచిపోలేదు. సింధును వదలిపెడితే మన మాతృభూమి కల్పనే అసంపూర్ణమవుతుంది. అఖండభారత కలను సాకారం చేసుకోవడానికే మనం సంకల్పం చేశాము " అన్నారు.

' ఈ స్వప్నానికి కార్యరూపం లభించేదెలా? ' అని స్వామీజీ మళ్ళీ ప్రశ్నించారు. అందుకు శ్రీ గురూజీ ఇలా అన్నారు: " ఏ కారణం కోసం దేశవిభజన జరిగిందో , దాన్నే తొలగించడం ద్వారా, అంతే. హిందూ సమాజం అసంఘటితంగా ఉండింది. అందువల్ల దేశం విభజించబడింది. హిందూ సమాజం సంఘటితం అయినపుడు దేశమూ అఖండమవుతుంది ".
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. ప్రశ్న విన్న శ్రీ గురూజీ చాలా ప్రశాంతంగా , విశ్వాసంతో కూడిన స్వరంతో " అవుతుంది.

    ReplyDelete