Breaking News

About

వందేమాతరం

భారత దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి, భారతమాత విముక్తికై పోరాడిన వీరులను రోజు గుర్తుచేసుకుందాం. మన నేటి కోసం వారి రేపటిని త్యాగం చేసిన మహానుభావులు. వారిని మన గుండెలలో నింపుకొని, వారు మనకు ఇచ్చిన స్ఫూర్తితో దేశాన్ని అభివృద్ది పదంలో నడుపుదాం. వారు కన్న కలలను నిజం చేయడానికి ప్రయత్నం చేద్దాం. స్వాతంత్ర్య స్ఫూర్తితో ముందుకు అడుగులు వేద్దాం. కులం, మతం వదిలేద్దాం, చేయి చేయి కలుపుదాం.

దేశం కోసం జీవించడం అంటే మన కోసం మనం జీవించటమే. మన కర్తవ్యాలను మనం నెరవేరిస్తే చాలు. వేసే ప్రతీ అడుగు దేశం కోసం ఉండాలని ఆలోచించాలి. విశ్వవ్యాప్తంగా భారత దేశం పేరు మారుమ్రోగాలి. 


యుక్తి యుక్త ముపాధేయం
వచనం బాలకాదపి !
అన్యతృన మివత్యాజ్యం
అప్యుక్తం పద్మజన్మనా!!

యుక్తమైన అనగా సబబైనా మాటను పసిపిల్లవాడు చెప్పినా గ్రహించాలి, యుక్తము కాని అనగా బేసబబైన మాటను సాక్ష్యాత్తు బ్రహ్మ చెప్పినా గడ్డిపరకలా విడిచి పెట్టాలి.

జై హింద్.
భారత్ మాతా కి జై....

భారత మాత సేవలో
- సాయి నాధ్ రెడ్డి.




మీ సలహాలు, సూచనలను ఇక్కడ కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు.

32 comments:

  1. వెంకటేశ్వర్లుAugust 31, 2014 at 12:35 PM

    మానవులు పుడతారు చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు .

    వీరిని "మృతజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నాన్ని మొదలు పెట్టారు. మీ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మిత్రమా!!! మీలాంటి మిత్రుల ఆశిస్సులు నాతోడుంటే నా ఈ ప్రయత్నం విజయవంతం అవుతుంది.

      Delete
  2. Nice attempt sainadh. You did a good job by bringing these stories under one roof.

    ReplyDelete
  3. you are unique bro. Inspiring thought.

    ReplyDelete
  4. ఈ ప్రయత్నంలో తెలుగు వారందరు పాల్గొని. రెండు తెలుగు రాష్ట్రాలకు ఏమి కావాలో ఇక్కడ చర్చించుకొని మన పాలకుల దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం.. థాంక్స్ సాయినాథ్ రెడ్డి గారు..మంచి ప్రయత్నానికి నాంది పలికారు మీరు.

    ReplyDelete
    Replies
    1. కాచ్చితంగా మీరు అన్నది జరిగితే బాగుంటుంది. అందుకే నేను చర్చల కోసం DISCUSSION FORUM అని ఒక విభాగం ఈ బ్లాగులో ఉంచాను. మీరు చుడండి.

      http://intheserviceofmotherindia.blogspot.in/p/blog-page.html

      Delete
    2. చూస్తాను. మీరు స్పందించినందుకు థాంక్స్..

      Delete
  5. స్వల్పము అల్పము అయిన ఈ జీవితం ఎలాగు ముగిసిపోతుంది.
    కానీ ఉన్నతమైన ఆదర్శాల కోసం కష్టాన్ని నష్టాన్ని లెక్క చేయక ప్రాణాల్ని తృణప్రాయంగా మాతృదేశం కోసం అర్పించే మహనీయులు కీర్తి శరీరంతో యుగయుగాలు జీవిస్తారు.
    వారు అమరజీవులు.

    ReplyDelete
    Replies
    1. కరెక్ట్ గా చెప్పావు మిత్రమా.

      Delete
  6. భారతీయుడుSeptember 7, 2014 at 2:06 PM

    ఒక మంచి ఆలోచన లక్షలాది మందిని కదిలిస్తుంది. లక్షలాది మందిలో కదలిక ఒక సమాజాన్ని కదిలిస్తుంది.-స్వామి వివేకానంద.

    వివేకానందుని మాటలు మీ ద్వారా నిజం కావాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు.

      Delete
    2. @భారతీయుడు.

      ఈ ప్రయత్నాన్ని సరిగ్గా అర్ధంచేసుకొని వివేకానంద మాటల్లో బాగా వర్ణించారు.

      Delete
  7. Replies
    1. థాంక్స్ మహేష్ గారు.

      Delete
  8. భరత మాతకి భరత జాతికి జై..

    ReplyDelete
  9. విలువలతో కూడిన ఆలోచనలు ఎప్పుడూ విజయవంతం అవుతాయి.

    ReplyDelete
  10. "YOUR DOING GOOD " WE WILL HELP U"

    ReplyDelete
  11. Good attempt brother

    ReplyDelete
  12. నాగేంద్రNovember 10, 2014 at 7:09 PM

    గత రెండు నెలలుగా మీ బ్లాగును నేను గమనిస్తున్నాను. నేను మొదట అనుకున్నాను ఇటువంటి బ్లాగులు పెడతారే కాని, ఎక్కువ కాలం కొనసాగవు అని అనుకున్నాను. కాని నా ఆలోచన తప్పు అని ఇప్పుడు అనిపిస్తుంది. సాయినాథ్ గారు మీకు ఇంకోవిషయం చెప్పాలి. ప్రస్తుతం ఎంతోమంది బ్లాగుల ద్వారా అబ్బదాలు ప్రచారం చేయటమో లేదా ఏదో సినిమా వాళ్ళ గురించి రాయటమో చేసి డబ్బులు సంపాదించాలి అనే ఆలోచనలతో ఉంటారు కాని మీరు వారందరికీ భిన్నంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం 80 శాతం మంది అబ్బదాలను చదవాలని కోరుకుంటున్నారు. సినిమాలు, రాజకీయాలు, కాకుండా. మీరు ఎంచుకున్న ఈ చక్కటి అంశాలు మరియు స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవటం ఎంతో స్పూర్తిని గుండెల నిండా నింపుతుంది. ఈ ప్రయత్నం ఇలాగే కొనసాగించండి.
    మీకు నా హృదయపూర్వక కృతఙ్ఞతలు.

    భారతమాతాకి జై.

    ReplyDelete
    Replies
    1. Well said Nagendra garu

      Delete
    2. తప్పకుండా కొనసాగిస్తాను. ధన్యవాద్ నాగేంద్ర గారు.

      Delete
  13. నేను రోజు చదివే బ్లాగులలో మొదట వుండేది మీ బ్లాగే సాయినాద్ గారు. విలువలను గుర్తుచేస్తుంటాయి ఇటువంటివి రచనలు.- Nagesh

    ReplyDelete